Brazil: బ్రెజిల్ జైల్లో మారణహోమం... తెగిపడిన తలలతో ఫుట్ బాల్ ఆడిన ఖైదీలు

  • అల్టామిరా జైల్లో ఖైదీ గ్రూపుల మధ్య భీకరదాడులు
  • 57 మంది మృతి
  • 16 మంది తలలు తెగనరికిన వైనం
బ్రెజిల్ లోని ఓ కారాగారంలో ఖైదీలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అల్టామిరా ప్రాంతీయ కారాగారంలో ఓ బ్యారక్ లో ఉన్న ఖైదీలు మరో బ్యారక్ లో చొరబడ్డారు. ఆ బ్యారక్ కు నిప్పుపెట్టడమే కాకుండా, మారణాయుధాలతో దాడికి దిగారు. ఈ రెండు గ్యాంగులు భీకరపోరు సాగిస్తుండగా, ఇతర ఖైదీలు జైలు పైభాగంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. దాడులు జరిగిన సమయంలో ఇద్దరు జైలు అధికారులను ఖైదీలు బందీలుగా ఉంచుకుని, దాడులు పూర్తయిన తర్వాత వారిని విడుదల చేశారు. ఒళ్లు జలదరించే అంశం ఏమిటంటే మరణించినవారిలో 16 మంది తలలు మొండెం నుంచి వేరుచేసిన ఓ వర్గం ఖైదీలు, ఆ తలలతో ఫుట్ బాల్ ఆడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో మీడియాలో ప్రసారమైంది. 
Brazil
Prison
Inmates
Beheading
Football

More Telugu News