Shakeela: నన్ను ప్రేమించిన వాళ్లంతా అందువల్లనే దూరమయ్యారు: నటి షకీలా

  • సిన్సియర్ గానే ప్రేమించాను
  •  కొందరి దృష్టి నా సంపాదనపై ఉండేది
  •  అమ్మను వదులుకోవడం నాకు ఇష్టం లేదన్న షకీలా

నిన్నటితరం శృంగార తారగా ఒక వెలుగు వెలిగిన షకీలా, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమకి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "నా జీవితంలో ఏడెనిమిది మందితో ప్రేమలో పడ్డాను. ఎవరితో వున్నప్పుడు వాళ్లను సిన్సియర్ గానే ప్రేమించాను. పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే లవ్ చేశాను.

అయితే వాళ్లంతా కూడా నా లైఫ్ లో మా బ్రదర్స్ ప్రమేయం ఉండకూడదనేవారు. మా అమ్మని వృద్ధుల శరణాలయంలో చేర్చమని అనేవాళ్లు. మా అమ్మను వదులుకోవడం మాత్రం నాకు ఇష్టం ఉండేది కాదు. అంతేకాదు నన్ను ప్రేమించిన వాళ్లలో కొందరి దృష్టి నా సంపాదనపై ఉందనే విషయం కూడా నాకు అర్థమవుతూ వచ్చింది. అందువల్లనే ప్రేమ వ్యవహారాలన్నీ దెబ్బతిన్నాయి" అని చెప్పుకొచ్చారు.

More Telugu News