Zee Network: 'జీటీవీ'పై కన్నేసిన అమెరికా కేబుల్ దిగ్గజం

  • జీ నెట్ వర్క్ ను సొంతం చేసుకునేందుకు పలు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి
  • బిడ్ సమర్పించిన కామ్ కాస్ట్ నేతృత్వంలోని కన్సార్టియం 
  • తొలి దశలో ఉన్న చర్చలు

భారత్ లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ జీ నెట్ వర్క్ లో ప్రధాన వాటాను సొంతం చేసుకునేందుకు అంతర్జాతీయంగా ప్రలు సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన కేబుల్ దిగ్గజం కామ్ కాస్ట్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ కన్సార్టియంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్, జేమ్స్ మర్దోక్ లుపా సిస్టమ్స్ భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికే బిడ్ సమర్పించినట్టు, చర్చలు తొలి దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో అనేక మీడియా సంస్థలు, కంటెంట్ ప్రొవైడర్లను కామ్ కాస్ట్ కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇండియాలో కూడా ప్రధాన మీడియా సంస్థను చేజిక్కించుకోవాలనే యోచనలో ఉన్న కామ్ కాస్ట్... జీ నెట్ వర్క్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

More Telugu News