Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రయోగాత్మక చిత్రంలో కాజల్ 
  • 'డియర్ కామ్రేడ్'కి భారీ రీమేక్ రేటు 
  • అత్తాకోడళ్లుగా హీరోయిన్లు!  
*  గత సంవత్సరం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'ఆ..' చిత్రంలో నటించిన కథానాయిక కాజల్ అగర్వాల్ మళ్లీ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. ప్రశాంత్ వర్మ తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో కాజల్ ను ఓ కీలక పాత్రకు ఎంచుకున్నట్టు సమాచారం.
*  విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ హక్కులను తీసుకున్నాడు. ఇందుకు గాను ఆయన 6.2 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.
*  తమిళ కథానాయకుడు ధనుశ్ తాజాగా నటిస్తున్న చిత్రం పేరు 'పటాస్'. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా డబుల్ రోల్స్ చేస్తున్నాడు. ఇక తండ్రి సరసన స్నేహ, కొడుకు సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారట.
Kajal Agarwal
Prashanth Varma
Vijay Devarakonda
Sneha

More Telugu News