Tik Tok: టిక్ టాక్ మాతృసంస్థ నుంచి త్వరలో స్మార్ట్ ఫోన్లు

  • భారత్ లో విశేషంగా ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ యాప్
  • స్మార్ట్ ఫోన్ల తయారీ కోసం స్మార్ట్ జాన్ టెక్నాలజీతో ఒప్పందం
  • ఏడు నెలలుగా కొత్త తరం స్మార్ట్ ఫోన్ కు రూపకల్పన
సోషల్ మీడియా రంగంలో టిక్ టాక్ యాప్ హవా అంతాఇంతా కాదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు టిక్ టాక్ వీడియోలు రూపొందించి ఆన్ లైన్ లో పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. టిక్ టాక్ మాతృసంస్థ చైనాకు చెందిన బైట్ డ్యాన్స్. ఇప్పుడీ సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది. త్వరలోనే స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలో కాలుమోపనుంది. ఈ మేరకు స్మార్ట్ జాన్ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు నెలలుగా స్మార్ట్ జాన్ సంస్థతో కలిసి కొత్త తరం స్మార్ట్ ఫోన్ రూపకల్పనకు శ్రమిస్తున్నామని బైట్ డ్యాన్స్ వర్గాలు తెలిపాయి.
Tik Tok
Byte Dance
Smart Phone

More Telugu News