Neeti Ayog: నీతి ఆయోగ్‌ సీఈవోకి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

  • స్థానికులకు అవకాశాలు పెంచేలా నిర్ణయం
  • సమాఖ్య విధానానికి కలిగే నష్టమేమీ లేదు
  • ఆ కథనం పూర్తిగా అసమగ్రమైనది
స్థానికేతరులకు అవకాశాలు తగ్గించడం ద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా తమ రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ చట్టాన్ని తీసుకొచ్చిందని ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనాన్ని జత చేస్తూ నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమితాబ్‌కాంత్ ట్వీట్‌పై స్పందించిన పీవీ రమేశ్ ఆ కథనం పూర్తిగా అసమగ్రమైనదంటూ కొట్టి పడేశారు. ఈ నిర్ణయం తీసుకోవడం వలన సమాఖ్య విధానానికి కలిగే నష్టమేమీ లేదన్నారు. దీనిపై తిరిగి అమితాబ్ కాంత్ స్పందించారు. ఆ పత్రిక కథనాన్ని మాత్రమే తాను పోస్ట్ చేశానని, ఆ వ్యాఖ్యలు తనవి కావని అన్నారు.  
Neeti Ayog
PV Ramesh
Amitabh Kanth
Financial Times
Non Local

More Telugu News