Hema: కావాలనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించారు: హేమ

  • నన్ను కావాలనే ఎలిమినేట్ చేశారు
  • హౌస్ లో ఉండటం అనవసరం అనిపించింది
  • లోపల ఒకటి జరిగితే.. బయట మరొకటి చూపించారు
బిగ్ బాస్-3 నుంచి మొదటి ఎలిమినేషన్ ప్రక్రియలో సినీ నటి హేమ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ షోపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను కావాలనే ఎలిమినేట్ చేశారని ఆరోపించారు. లోపల ఒకటి జరిగితే, బయట మరొకటి చూపించారని మండిపడ్డారు. వంటగది వల్లే హౌస్ లో గొడవలు వచ్చాయని... అది తీయొద్దు, ఇది తీయొద్దు అని తాను చెప్పడాన్ని కమాండింగ్ గా అర్థం చేసుకున్నారని చెప్పారు. వాళ్ల కోసం తాను చేస్తున్నది వాళ్లకు అర్థం కాలేదని... అందుకే హౌస్ లో ఉండటం అనవసరమనిపించిందని తెలిపారు. అక్కా, అక్కా అని పిలుస్తూనే తనపై లేనిపోని మాటలు చెప్పారని వాపోయారు.
Hema
Bigg Boss
Tollywood

More Telugu News