Roja Ramani: ఆ పాత్రకి డబ్బింగ్ చెబుతూ ఏడ్చేసేదానిని: నటి రోజా రమణి

  • నటిగా మంచి గుర్తింపు 
  • డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు
  •  'సీతారామయ్య గారి మనవరాలు' గురించి రోజా రమణి   
రోజా రమణి అనేక చిత్రాలలో నటించారు .. ఆ తరువాత ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. ఆమె వాయిస్ చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి రోజా రమణి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'సీతారామయ్యగారి మనవరాలు'లో మీనాకి డబ్బింగ్ చెప్పమని దర్శకుడు క్రాంతికుమార్ గారు అడిగారు. 'మీనా చిన్నమ్మాయి కదా .. నా వాయిస్ ఎక్కువైపోతుందేమో' అన్నాను నేను.

'కాస్త మార్చి చెప్పేయండి' అన్నారాయన. సాధారణంగా ఏ సినిమాకైనా రెండు రోజుల్లోనే డబ్బింగ్ చెప్పేస్తుంటాను. అలాంటిది 'సీతారామయ్య గారి మనవరాలు'లో మీనాకి డబ్బింగ్ చెప్పడానికి 5 రోజులు పట్టేసింది. ఎందుకంటే ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తూ ఏడ్చేసే దానిని. బాధతో గొంతు పెగలక డబ్బింగ్ చెప్పలేకపోయేదానిని. అందువలన ఎక్కువ సమయం తీసుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.
Roja Ramani
Meena

More Telugu News