Bhavana: ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోవడానికి అదే కారణం: నటి భావన

  • నాలుగేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ ను చేశారు
  • నటనలోనే ఎదుగుతూ వచ్చాను 
  • సీనియర్స్ నుంచి చాలా నేర్చుకున్నానన్న భావన

తాజా ఇంటర్వ్యూలో భావన మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "నాకు నాలుగేళ్ల వయసు వున్నప్పుడు మా నాన్నగారి స్నేహితుడు ఒకాయన నన్ను చూశారట. పాప బాగుంది .. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేస్తే బాగుటుందని మా నాన్నగారిని ఒప్పించారట. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాను.

అలా ఇండస్ట్రీలోనే ఎదుగుతూ వచ్చాను. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేశాను. వాళ్లందరినీ చాలా దగ్గరగా గమనిస్తూ వచ్చాను. నటన పట్ల ఎంతటి అంకితభావం ఉండాలో .. ఎంతటి క్రమశిక్షణగా నడుచుకోవాలో నాకు అర్థమైంది. అప్పటి నుంచి నన్ను నేను మలచుకుంటూ వచ్చాను. అలా ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నాను" అని చెప్పుకొచ్చింది. 

More Telugu News