Kuldeep Bishnoi: హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఐటీ దాడులు.. రూ.. 200 కోట్ల విలువైన విదేశీ ఆస్తుల గుర్తింపు!

  • ఐటీ వలకు చిక్కిన హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్
  • రూ. 30 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తింపు
  • ఈడీ, ఇతర శాఖలతో సమాచారం పంచుకుంటామన్న ఐటీ శాఖ

దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయవేత్తలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయి, అతని కుటుంబసభ్యులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. 200 కోట్ల విలువైన విదేశీ ఆస్తులను గుర్తించారు. ఢిల్లీ, హర్యాణా, హిమాచల్ ప్రదేశ్ లలో ఈ నెల 23న కుల్దీప్ కు చెందిన 13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో విదేశీ ఆస్తులను గుర్తించామని ఐటీ అధికారులు తాజాగా ప్రకటించారు.

రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులు కొన్ని దశాబ్దాలుగా నల్ల ధనాన్ని భారీ ఎత్తున పోగేసుకుంటున్నారని ఐటీ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కుల్దీప్ కు రూ. 200 కోట్ల విదేశీ ఆస్తులు ఉన్న విషయాన్నే కాకుండా, రూ. 30 కోట్లకు పైగా ఆదాయపు పన్నును ఎగ్గొట్టారనే విషయాన్ని కూడా గుర్తించామని వెల్లడించింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, పనామా, యూకే, యూఏఈలలో ఈ ఆస్తులు ఉన్నాయని తెలిపింది. ఈ వివరాలను ఈడీతో పాటు ఇతర దర్యాప్తు శాఖలతో పంచుకుంటామని చెప్పింది.

More Telugu News