Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ!

  • కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వలేమన్న సర్కారు
  • ఏ కోర్టు స్టే ఇచ్చిందో చెప్పాలని ముద్రగడ డిమాండ్
  • కాపులు బానిసలుగా బతకాలా? అని నిలదీత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా మండిపడ్డారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకే 5 శాతం ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీ ముఖ్యమంత్రికి ఈరోజు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ, ఈ 5 శాతం రిజర్వేషన్ పై ఏ కోర్టు స్టే ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాపు జాతి ఎలాంటి కోరికలు, ఆశలు లేకుండా బానిసలుగా బతకాలా? అని ప్రశ్నించారు. కేవలం జగన్ ఇస్తామన్న రూ.2,000 కోట్లకు ఆశపడి కాపులు ఆయనకు ఓటేయలేదని స్పష్టం చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైనా కోర్టు స్టే ఇచ్చి వుంటే 2024 వరకూ కాపుల హక్కులపై మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Chief Minister
kapu leader
mudragada
open letter

More Telugu News