Vijay devarakonda: నైజామ్ లో 'డియర్ కామ్రేడ్' దూకుడు

  • ఈ నెల 26న వచ్చిన 'డియర్ కామ్రేడ్' 
  • ఓవర్సీస్ లోను భారీ వసూళ్లు 
  • హిందీ రీమేక్ కి సన్నాహాలు      

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ఈ నెల 26వ తేదీన 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

ఇక నైజామ్ లో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తొలి మూడు రోజుల్లో ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 5.68 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక తెలంగాణలో ఈ రోజు కూడా బోనాల పండుగ సందర్భంగా సెలవు కావడంతో, ఈ రోజున కూడా మంచి వసూళ్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను విడుదలైన ఈ సినిమాను, హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

  • Loading...

More Telugu News