Telangana: తెలంగాణ సాహితీ సౌరభం సినారెకు నివాళులు!: టీఆర్ఎస్ నేత కేటీఆర్

  • ఆయన తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారు
  • తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి జయంతి నేడు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సి.నారాయణ రెడ్డి తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారని కేటీఆర్ తెలిపారు. తన సాహిత్యంతో తెలంగాణ ఖ్యాతిని ఆయన విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. సి.నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News