Raghuveera Reddy: జైపాల్‌రెడ్డి సీఎం అయ్యుంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదు: రఘువీరా

  • జైపాల్‌రెడ్డి వల్లే తెలంగాణ వచ్చింది
  • అనేక విషయాల పట్ల పరిజ్ఞానం ఉంది
  • నీతికి, నిజాయితీకి మారుపేరు
దివంగత కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి సీఎం అయి ఉంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదని ఆ పార్టీ నేత రఘువీరారెడ్డి పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని రఘువీరా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రావడానికి కారణం జైపాల్‌రెడ్డేనని వ్యాఖ్యానించారు.

ఆయనకు అనేక విషయాల పట్ల మంచి పరిజ్ఞానం ఉందని, ఎన్నో విషయాలపై అవగాహన కల్పించేవారన్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరుగా జైపాల్‌రెడ్డిని అభివర్ణించారు. తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని, అంగవైకల్యం అభివృద్ధికి అడ్డురాదని జైపాల్‌రెడ్డి నిరూపించారని రఘువీరా పేర్కొన్నారు.
Raghuveera Reddy
Jaipal Reddy
Congress
Telangana

More Telugu News