Jyothula Nehru: కాపులపై కసితోనే రిజర్వేషన్లు సాధ్యం కావంటున్నారు: జగన్ పై జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు

  • కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు సాధ్యం కావన్న ఏపీ సర్కారు
  • జగన్ కాపులకు అన్యాయం చేస్తున్నారంటూ జ్యోతుల మండిపాటు
  • జగన్ రాజకీయాల్లోనూ క్విడ్ ప్రోకో పాటిస్తున్నారంటూ ఆరోపణ
ఐదు శాతం కాపు రిజర్వేషన్లు అమలు చేయలేమని ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పడంపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ స్పందించారు. కాపులపై కసితో మాత్రమే రిజర్వేషన్లు సాధ్యం కావని అంటున్నారని సీఎం జగన్ పై మండిపడ్డారు. టీడీపీ పాలనలో కాపులకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నామని, కానీ జగన్ మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల అంశంలో ఎలాంటి ప్రయత్నం చేయలేదంటూ సర్కారును తప్పుబట్టారు.

వ్యాపార రంగంలో క్విడ్ ప్రోకో గురించి బాగా తెలిసిన జగన్, రాజకీయాల్లోనూ అదే పద్ధతిలో నడుస్తున్నారని జ్యోతుల ఆరోపించారు. కాపుల అండతో అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని జగన్ గుర్తెరగాలని హితవు పలికారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంతో పోరాడాలని, అవసరమైతే వైసీపీ సర్కారుకు టీడీపీ కూడా మద్దతుగా నిలుస్తుందని అన్నారు.
Jyothula Nehru
Telugudesam
Jagan
Kapu
Reservations

More Telugu News