Karnataka: కర్ణాటక అసెంబ్లీలో మరోసారి విశ్వాస పరీక్ష... విజయంపై యడియూరప్ప ధీమా

  • సోమవారం బలనిరూపణ
  • 100 శాతం మెజారిటీ సాధిస్తామన్న యడియూరప్ప
  • ఆపై శాసనసభలో ఆర్థిక బిల్లు పెడతామంటూ వెల్లడి
కర్ణాటక అసెంబ్లీలో మరోసారి బలనిరూపణ నిర్వహించనున్నారు. కొత్త సీఎం యడియూరప్ప శాసనసభలో తన బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీనిపై యడియూరప్ప మాట్లాడుతూ, విశ్వాస పరీక్షలో విజయం సాధించేది తామేనని అన్నారు. 100 శాతం మెజారిటీతో విజయాన్నందుకుంటామని చెప్పారు. కాగా, విశ్వాస పరీక్ష అనంతరం సభలో ఆర్థిక బిల్లును ఆమోదింపచేసుకోవాల్సి ఉందని, ఆ బిల్లుకు ఆమోదం రాకపోతే ఉద్యోగుల జీతాలకు నిధులు వినిగించుకోలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఈ బిల్లును కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు రూపొందించింది. అయితే, ఈ బిల్లులో ఎలాంటి మార్పులు లేకుండానే సభలో ప్రవేశపెడతామని యడియూరప్ప వెల్లడించారు.
Karnataka
Yadiyurappa
BJP
Congress
JDS

More Telugu News