YSRCP: జగన్ రాజకీయ ప్రస్థానంపై ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ పుస్తకావిష్కరణ

  • ఈ పుస్తక రచయిత బీసీ నేత బాయన శేఖర్ బాబు
  • పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి
  • ఇచ్చిన హామీల అమలుకు జగన్ కృషి చేస్తున్నారు

వైసీపీ అధినేత జగన్ తన ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యలను విన్నానని, వాళ్లను ఆదుకునేందుకు తాను ఉన్నానని అంటూ తరచుగా చేసిన నినాదం ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’. ఈ నినాదం ఎంతగా ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ డైలాగ్ నే ఆధారంగా చేసుకుని, జగన్ రాజకీయ ప్రస్థానంపై బీసీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాయన శేఖర్ బాబు ఓ పుస్తకాన్ని రూపొందించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు.

వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలు, శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News