Jaipal Reddy: కేసీఆర్ కీలక నిర్ణయం.. పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలు!

  • స్థలం కేటాయించిన ప్రభుత్వం
  • రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు
  • సంతాపం తెలిపిన కేసీఆర్
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డి అంత్యక్రియల విషయమై, టీఆర్ఎస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి స్మారకానికి స్థలాన్ని కేటాయిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ వెల్లడించారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని, ఆపై ఆ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మారుస్తామని అన్నారు.

జైపాల్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ప్రజల కల ఫలించడం వెనుక ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో తనకు తెలుసునని అన్నారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాగా, జైపాల్ అంత్యక్రియలు రేపు జరుగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని, భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం గాంధీభవన్ కు తరలించి, ఆపై నక్లెస్ రోడ్ కు తీసుకెళతామని కుటుంబీకులు వెల్లడించారు.
Jaipal Reddy
KCR
Last Riots
Hyderabad
Nacles Road

More Telugu News