Balakrishna: బాలకృష్ణ, మోక్షజ్ఞ రహస్య పూజలు... కారణమిదే!

  • సినిమాలు వద్దంటున్న మోక్షజ్ఞ
  • మనసు మార్చేందుకు బాలయ్య ప్రయత్నాలు
  • ప్రత్యేకంగా పూజలు చేయించిన బాలయ్య
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన కుమారుడు మోక్షజ్ఞతో పుల్లేటికుర్రులో ఉన్న శ్రీ చౌడేశ్వరి సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి రహస్యంగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తన తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంలో భాగంగానే ఈ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ పర్యటన అత్యంత గోప్యంగా జరుగగా, పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. కనీసం మీడియాను కూడా అనుమతించలేదు. పూజలు ముగిసిన తరువాత బాలకృష్ణ, మోక్షజ్ఞలు మీడియాకు కనిపించారు.

కాగా, మోక్షజ్ఞను హీరో చేయాలని బాలకృష్ణ తపిస్తుంటే, తనకు సినిమాలు వద్దని మోక్షజ్ఞ స్పష్టం చేస్తున్నాడని గత కొంతకాలంగా టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్న సంగతి తెలిసిందే. హీరో కావాలన్న ఆలోచన తనకు లేదని మోక్షజ్ఞ చెబుతుంటే, అతని మనసును సినిమాలవైపు మళ్లించేందుకు బాలయ్య ఈ పూజలు చేయించారని తెలుస్తోంది.
Balakrishna
Mokshagna
Pulletikurru

More Telugu News