Bigg boss: బిగ్ బాస్ నుంచి తొలి ఎలిమినేషన్ హేమ!

  • నేడు తొలి ఎలిమినేషన్
  • హేమ కు వ్యతిరేకంగా కంటెస్టెంట్స్
  • నేడు హోస్ నుంచి బయటకు వచ్చే అవకాశం
టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ లో వారం రోజుల తరువాత తొలి ఎలిమినేషన్ జరగనుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, నేడు సినీ నటి హేమ బయటకు వస్తుందని తెలుస్తోంది. నామినేషన్ లో ఉన్న ఆరుగురి నుంచి హిమజ, పునర్నవి సేఫ్ అయినట్టు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలిన వారిలో హేమ అంటేనే కంటెస్టెంట్స్ అందరిలో అధిక వ్యతిరేకత ఉంది. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి హేమ అందరినీ డామినేట్ చేస్తూ వచ్చిందని నాగ్ స్వయంగా సెటైర్ వేయడం గమనార్హం. అందుకే హేమను మిగతా అందరూ కలిసి నామినేషన్ లో ఉంచారని కూడా అన్నారు. ఇక హేమ ఇవాళ ఎలిమినేట్ అవుతుందా? అంటే రాత్రి వరకూ ఆగాల్సిందే.
Bigg boss
Hema
Elimination
Nagarjuna

More Telugu News