Cab Driver: మోడల్ పై అత్యాచార యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న వైనం!

  • పుట్టినరోజు వేడుకకు హాజరై వస్తున్న మోడల్
  • స్నేహితుడితో కలిసి క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం
  • నాలుక కొరికి తప్పించుకున్న మోడల్
ఓ క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు కలిసి ఓ మోడల్‌పై అత్యాచారానికి యత్నించగా చాకచక్యంగా నిందితుడి నాలుకను కొరికేసి అక్కడి నుంచి తప్పించుకుంది. జైపూర్‌లో ఓ మోడల్ తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు హాజరై అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితులిద్దరూ బొమ్మ తుపాకితో బెదరించి మోడల్‌పై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో నిందితుడి నాలుకను కొరికి అక్కడి నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అయితే మోడల్ తన సెల్‌ఫోన్‌ను కారులోనే వదిలేయడంతో పోలీసులు దానికి కాల్ చేశారు. నిందితుడు ఫోన్ లిఫ్ట్ చేయడంతో అతడి ఆచూకీ కనుక్కుని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు నాలుకకు అయిన గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో అనుమానమొచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రెండో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Cab Driver
Model
Jaipur
Birthday Party
Cell Phone
Police

More Telugu News