USA: అమెరికాలో సిక్కు పూజారిపై జాతి విద్వేష దాడి!

  • కాలిఫోర్నియాలోని మోడెస్టో సెరెస్ లో ఘటన
  • గురుద్వారలో పూజారిగా ఉన్న అమర్జిత్
  • మీ దేశానికి వెళ్లిపో అని దాడిచేసిన దుండగుడు

అగ్రరాజ్యం అమెరికాలో జాతి విద్వేష నేరం చోటుచేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మోడెస్టో సెరెస్ పట్టణంలో అమర్జిత్ సింగ్ అనే సిక్కు గురుద్వారలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత గురువారం రాత్రి అమర్జిత్ ఇంటి అద్దాలను ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. అనంతరం ఇంట్లోకి చొరబడి అమర్జిత్ పై దాడిచేశాడు. ఈ సందర్భంగా ‘మీ దేశానికి వెళ్లిపో’ అంటూ దూషించాడు. ఈ ఘటనపై అమర్జిత్  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేశారు.

More Telugu News