BCCI: దేశవాళీ క్రికెట్ లో మరో కొత్త జట్టుకు గుర్తింపునిచ్చిన బీసీసీఐ

  • బీసీసీఐ అనుబంధ సంఘంగా చండీగఢ్ కు గుర్తింపు
  • 1982లో ప్రారంభమైన యూటీసీఏ
  • ఇకపై స్థానిక ఆటగాళ్లకు చండీగఢ్ తరఫున ఆడే అవకాశం
భారత్ లో అనేక రాష్ట్రాలు బీసీసీఐకి అనుబంధంగా క్రికెట్ జట్లను కలిగివున్నాయి. ఇప్పుడు వాటి సరసన మరో కొత్త జట్టు వస్తోంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న చండీగఢ్ ను బీసీసీఐ తన అనుబంధ సంఘంగా గుర్తించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఇకమీదట చండీగఢ్ కూడా రంజీ ట్రోఫీ, ఇతర దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొనవచ్చు. వాస్తవానికి చండీగఢ్ లో యూటీసీఏ పేరుతో క్రికెట్ అసోసియేషన్ 1982లోనే ఏర్పాటైంది. అయితే, బీసీసీఐ గుర్తింపు లభించడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇప్పటివరకు చండీగఢ్ ఆటగాళ్లు అటు పంజాబ్, ఇటు హర్యానా రంజీ జట్లలో ఆడేవారు. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఇకపై స్థానిక ఆటగాళ్లు చండీగఢ్ టీమ్ కు ఆడే వెసులుబాటు కలిగింది.
BCCI
Cricket
Chandigarh

More Telugu News