Andhra Pradesh: నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేజన్ల విధానం టీటీడీకి వర్తించదన్న చైర్మన్ సుబ్బారెడ్డి!

  • 50 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం
  • ధర్మకర్తల మండలికి వర్తించదన్న చైర్మన్ సుబ్బారెడ్డి
  • స్వామీజీలు, మఠాధిపతుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లోని నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 50 శాతం రిజర్వేషన్ల నుంచి టీటీడీ ధర్మకర్తల మండలికి మినహాయింపు ఇచ్చామని సుబ్బారెడ్డి తెలిపారు.

స్వామీజీలు, మఠాధిపతుల సూచనల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మతపరమైన విభేదాలు తలెత్తకుండా తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అంతకుముందు అశ్విని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.

More Telugu News