Andhra Pradesh: తిరుమలలో భక్తుల కోసం అత్యాధునిక వైద్య సౌకర్యాలు.. అశ్విని ఆసుపత్రిలో ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి!

  • పలు పనులను సమీక్షించిన టీటీడీ చైర్మన్
  • ఆసుపత్రి సౌకర్యాలపై వైద్యులతో చర్చ
  • ఈ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సుబ్బారెడ్డి  
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో అశ్విని ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

అలాగే ఆలయ పనుల పర్యవేక్షణలో భాగంగా అశ్విని ఆసుపత్రి, ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్, డంపింగ్ యార్డులను తనిఖీ చేశామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలను వైవీ సుబ్బారెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.
Andhra Pradesh
Tirumala
TTD
YV Subba Reddy
Twitter
new health facility

More Telugu News