Andhra Pradesh: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ప్రారంభం.. బరిలో దిల్ రాజు వర్సెస్ వైవీఎస్ చౌదరి!

  • ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్
  • మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు
  • యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్-మన ప్యానెల్ మధ్యే పోటీ
తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకూ సాగనుంది.  అనంతరం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో 4,500 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ ఎన్నికల్లో చాలామంది నిర్మాతలు పోటీ పడుతున్నప్పటికీ  యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్, మన ప్యానెల్ తరఫునే పోటీ ఉండనుంది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ తరఫున దిల్ రాజు, డీవీవీ దానయ్య, సాయి కొర్రపాటి పోటీ పడుతుండగా, మన ప్యానెల్ తరఫున సి.కల్యాణ్, వైవీఎస్ చౌదరి, నట్టి కుమార్ బరిలో ఉన్నారు. తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలను టాలీవుడ్ ఆసక్తిగా గమనిస్తోంది.
Andhra Pradesh
Telangana
Tollywood
film chamber
elections

More Telugu News