పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. న్యాయం చేయాలంటూ కేటీఆర్‌కు యువతి మొర!
- ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకుడు
- కేటీఆర్‌ను కలిసి సమస్యను వివరించిన యువతి
- పరిష్కరించాల్సిందిగా మహిళా విభాగానికి సూచన
వనపర్తి జిల్లాలోని వెలటూరుకు చెందిన యువతి, కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ ప్రేమించుకున్నారు. యువతితో సన్నిహితంగా తిరిగిన యువకుడు ఆ తర్వాత ప్లేటు మార్చాడు. దీంతో యువతి కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించింది. అక్కడ పోలీసుల సమక్షంలో 20 రోజుల్లో ఆమెను పెళ్లాడతానని యువకుడు మాటిచ్చాడు. ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా మళ్లీ పెళ్లిమాట లేకపోవడంతో యువతి కేటీఆర్‌ను ఆశ్రయించింది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసింది. సమస్యను వివరించి తనకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. స్పందించిన కేటీఆర్ సమస్యను పరిష్కరించాలంటూ టీఆర్ఎస్ మహిళా విభాగానికి సూచించారు.