Ap Express: ఏపీ ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీల్లో ఇబ్బందులు తలెత్తకుండా కొత్త టెక్నాలజీ

  • పవర్ జనరేటర్ కార్ల స్థానంలో ‘హెడ్ ఆన్ జనరేషన్’  
  • తొలిసారిగా విశాఖ-ఢిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్ లో వినియోగం
  • వాల్తేర్ డీఆర్ఎం చొరవతో ఈ టెక్నాలజీ వినియోగంలోకి 

ఏపీ ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. హెడ్ ఆన్ జనరేషన్ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేయనున్నారు. విశాఖ-ఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ కు ఈ టెక్నాలజీని వినియోగించారు. పవర్ జనరేటర్ కార్ల స్థానంలో ‘హెడ్ ఆన్ జనరేషన్’ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ చొరవతో ఈ కొత్త టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఏపీ ఎక్స్ ప్రెస్ లోని ఒక ర్యాక్ కు ఈ విధానం అమలు చేయగా, మిగిలిన మూడు ర్యాక్ లకు త్వరలో అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం చేతన్ కుమార్ మాట్లాడుతూ, ఈ విధానం వల్ల వాయు, శబ్ద కాలుష్యం తగ్గుతుందని అన్నారు.

More Telugu News