Yedyurappa: యడ్యూరప్ప బలనిరూపణకు ఈనెల 31 డెడ్ లైన్!

  • ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపు
  • నెలాఖరులోగా విశ్వాస పరీక్షను నెగ్గాల్సిందే
  • స్పష్టం చేసిన గవర్నర్ వాజూభాయ్ వాలా

కర్ణాటకలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీఎస్ యడ్యూరప్పకు అనుమతి ఇచ్చిన గవర్నర్ వాజూభాయ్ వాలా, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు ఈ నెలాఖరు వరకూ గడువిచ్చారు. 31వ తేదీలోగా అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గాలని ఆయన ఆదేశించారు. కాగా, నేడు కర్ణాటకకు నాలుగోసారి సీఎంగా యడ్యూరప్ప నేటి సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 76 సంవత్సరాల వయసున్న ఆయన స్థానంలో మరొకరిని సీఎంగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్ఠానం భావించినప్పటికీ, స్థానిక బలాబలాలు యడ్యూరప్పకే అనుకూలంగా మారాయి. 

More Telugu News