Varun Bahar: రెచ్చగొట్టేలా పాట పాడి కష్టాలు కొని తెచ్చుకున్న సింగర్ వరుణ్ బహార్!

  • జై శ్రీరామ్ అనకుంటే శ్మశానానికే
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన పలువురు
  • వరుణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రముఖ గాయకుడు వరుణ్ బహార్, రెచ్చగొట్టేలా పాటను పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. జై శ్రీరామ్ అని అనేందుకు ఇష్టపడని వారిని శ్మశానానికి పంపాలనే అర్థం వచ్చేలా "జో నా బోలే జై శ్రీ రామ్, ఉస్కో భెజో కబరిస్తాన్" అంటూ ఓ పాటను పాడి యూ ట్యూబ్‌ లో షేర్‌ చేశాడు, ఈ పాట వైరల్ కావడం, దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో, కేసు నమోదు చేసి, వరుణ్ ను ఉత్తరప్రదేశ్ లోని మంకపూర్‌ సమీపంలోని బండారా గ్రామంలో అరెస్టు చేశారు. వరుణ్ ను కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఇండియాలో అసహనం పెరిగిపోయిందని, మూక దాడులను ఆపాల్సిందేనని పలువురు సెలబ్రిటీలు ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్న వేళ, ఈ తరహా ఘటన జరగడం గమనార్హం.
Varun Bahar
Singer
Arrest
Police

More Telugu News