ఆజంఖాన్ లాంటి పిచ్చికుక్క తల తెగనరకండి.. ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ నేత
- ప్యానెల్ స్పీకర్ రమాదేవిపై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు
- తలనరికి పార్లమెంటు ద్వారానికి వేలాడదీయాలన్న బీజేపీ నేత ఆఫ్తాబ్
- అలా చేస్తే ఆజంఖాన్, అసద్ లాంటి వాళ్లకి బుద్ధొస్తుందన్న నేత
రమాదేవిపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనన్న ఆయన, ఆజం తలను తెగనరకాలని, పార్లమెంటు ద్వారానికి వేలాడదీయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తద్వారా మహిళలను అవమానిస్తే ఏం జరుగుతుందో ఆజంఖాన్, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారికి తెలిసొస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహిళలను అవమానపరిస్తే ఇకపై ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని ఆఫ్తాబ్ హెచ్చరించారు. ఆజంఖాన్ తొలుత జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు రమాదేవిని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖండించాల్సిన విషయమన్నారు. ఈ పెద్దమనిషికి పిచ్చెక్కిందని తాను ఇది వరకే చెప్పానని గుర్తుచేశారు. దేశానికి హానికరంగా తయారవుతున్న పిచ్చి కుక్కను చంపాల్సిందేనని ఆఫ్తాబ్ తేల్చి చెప్పారు.