Chandrababu: కేసీఆర్ మంచివారని అనగానే చంద్రబాబు ‘టక్కున లేచారు’!: అంబటి రాంబాబు

  • చంద్రబాబునాయుడు చెడ్డవారని అనలేదే
  • బాబుకు కడుపు మంట ఎందుకు?
  • సభలో ప్రసంగిస్తుంటే అడ్డుతగలడం మంచి పద్ధతి కాదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచివారని ఏపీ సీఎం జగన్ అనగానే చంద్రబాబు ‘టక్కున లేచారు’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. ఏపీ శాసనసభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఏపీకి గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరిస్తున్నారని, చాలా మంచి వారని అధికారపక్ష నాయకుడు జగన్ అన్నారే తప్ప, చంద్రబాబు నాయుడు చెడ్డవారని అనలేదని అన్నారు. కేసీఆర్ ను మంచివారంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. చంద్రబాబు కన్నా కేసీఆర్ వెయ్యిరెట్లు మంచివారని ఉద్ఘాటిస్తున్నానని అన్నారు. సభా నాయకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పకముందే, ఆయన ప్రసంగానికి అడ్డుతగలడం మంచి పద్ధతి కాదని, సజావుగా నడిచే సభను ఏదో ఒక విధంగా ఆటంకపరచాలని చూడటం కరెక్టు కాదని అన్నారు.
Chandrababu
kcr
jagan
ambati rambabu

More Telugu News