Andhra Pradesh: పీపీఏల వ్యవహారం.. విద్యుత్ కంపెనీల పిటిషన్ పై హైకోర్టులో వాదనలు

  • ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోపై సవాల్ 
  • కాంపిటీటివ్ బిడ్డింగ్ లోనే కాంట్రాక్టులు దక్కించుకున్నాం
  • ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తర్వాతే ఒప్పందాలు  

ఏపీలో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సవ్యంగా లేవని ప్రస్తుత ప్రభుత్వం తప్పుబడుతున్న విషయం తెలిసిందే. విద్యుత్ కంపెనీలకు ఎక్కువగా ధరలు చెల్లించి, ఎటువంటి బిడ్డింగ్స్ నిర్వహించకుండా ఆయా విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరు ఆక్షేపణీయంగా ఉందని ఆయా విద్యుత్ కంపెనీలు విమర్శిస్తున్నాయి.

ఈ విషయమై విద్యుత్ కంపెనీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ విద్యుత్ సంస్థలు ఓ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి. కాంపిటీటివ్ బిడ్డింగ్ లోనే కాంట్రాక్టులు దక్కించుకున్నామని, ఏపీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తర్వాతే డిస్కంలతో ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నాయి. చెల్లించిన బిల్లులు సైతం మళ్లీ సమీక్షించాలని జీవో జారీ చేయడం, పీపీఏల వ్యవహారంలో ప్రభుత్వం తీరు ఆక్షేపణీయమని కంపెనీల తరపు న్యాయవాది తన వాదన వినిపించారు.

More Telugu News