Telugudesam: తెలంగాణ ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు బయటపెట్టాలి : ఏపీ మండలిలో టీడీపీ సభ్యుల డిమాండ్‌

  • గోదావరి జలాల వినియోగంపై టీడీపీ వాయిదా తీర్మానం
  • ఏపీ హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణ
  • గందరగోళం...ఐదు నిమిషాలు సభ వాయిదా

గోదావరి జలాల వినియోగం అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలను వెంటనే బయటపెట్టాలని తెలుగు దేశం ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. గోదావరి జలాల వినియోగం అంశంపై ఈరోజు టీడీపీ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానాన్ని మండలి చైర్మన్‌ తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ హక్కులకు భంగం కలిగేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో సభలో తీవ్రగందరగోళం నెలకొంది. పరిస్థితిని సరిదిద్దేందుకు మండలి చైర్మన్‌ ఐదు నిమిషాలపాటు సభను వాయిదా వేశారు.

More Telugu News