Sadhguru: హిమదాస్‌ను అభినందిస్తూ సద్గురు ట్వీట్.. తప్పుడు పదం ఉపయోగించారంటూ నెటిజన్ల ఫైర్!

  • సద్గురు వాడింది అసభ్య పదజాలమన్న నెటిజన్లు
  • కానేకాదంటున్న మరికొందరు
  • ట్విట్టర్‌లో వార్

సద్గురుగా ప్రసిద్ధులైన జగ్గీవాసుదేవ్ తన ఆధ్యాత్మిక బోధనలతో ఎంతోమందిలో చైతన్యం నింపారు. అలాంటి ‘సద్గురు’ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. భారత స్పోర్ట్స్ స్టార్, గోల్డెన్ గాళ్ హిమదాస్ 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సద్గురు కూడా ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. అయితే, తన ట్వీట్‌లో ‘గోల్డెన్ షవర్ ఫర్ ఇండియా’ అని రాయడం ట్రోలింగ్‌కు కారణమైంది.

ఈ పదాన్ని చూసిన నెటిజన్లు సద్గురు బ్లెస్సింగ్స్‌ను తప్పుబడుతున్నారు. ‘గోల్డెన్ షవర్’ అనేది అసభ్య పదజాలమని, దానిని లైంగిక చర్యలో భాగంగా వాడతారని వివరిస్తూ సద్గురును ట్రోల్ చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం సద్గురును సమర్థిస్తున్నారు. ప్రతీ పదాన్ని అదే కోణంలో చూడడం తగదని, హిమదాస్ బంగారు వర్షం కురిపిస్తోందన్న ఉద్దేశంలో ఆయనా పదాన్ని వాడారని అంటున్నారు. నిజానికి సద్గురు వాడిన పదంలో తప్పేం లేదని, పాశ్చాత్య దేశాల్లో ఆ పదం అర్థాన్ని మార్చేశారని మరికొందరు అంటున్నారు. 

More Telugu News