Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. డిన్నర్‌కు ఆహ్వానించిన సీఎం కమల్‌నాథ్

  • క్రిమినల్ లాకు సవరణలు చేసిన కమల్‌నాథ్ సర్కారు
  • అనుకూలంగా ఓటేసిన ఇద్దరు బీజేపీ సభ్యులు
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీజేపీ

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా ఓటేసి అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేశారు. క్రిమినల్ చట్టాన్ని సవరణలు చేస్తూ కమల్‌నాథ్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కౌల్‌లు అనుకూలంగా ఓటేశారు. ఆ వెంటనే వారిని కాంగ్రెస్ నేతలు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి రాత్రికి సీఎం ‌కమల్‌‌నాథ్‌తో డిన్నర్‌కు ఆహ్వానించారు.

కాగా, బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ వారే కావడం గమనార్హం. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఇది ‘ఘర్ వాపసీ’లో భాగమని పరోక్షంగా బీజేపీకి బైబై చెప్పనున్నట్టు ప్రకటించారు. తమ సభ్యులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేయడంపై బీజేపీ మండిపడింది. అధిష్ఠానం ఆదేశిస్తే కమల్‌నాథ్ ప్రభుత్వం 24 గంటల్లో కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ భార్గవ హెచ్చరించారు.

More Telugu News