Allagadda: బీజేపీలోకి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సోదరుడు కిశోర్ రెడ్డి!

  • తప్పిదాల కారణంగానే టీడీపీ ఓడింది
  • భూమా వర్గాన్ని కాపాడుకునేందుకే బీజేపీలోకి
  • ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే
టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు, మాజీ మంత్రి అఖిలప్రియకు అన్న వరుసైన ఆళ్లగడ్డ మాజీ ఎంపీపీ భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. బీజేపీ నాయకులతో ఆయన ఇప్పటికే టచ్‌లో ఉన్నట్టు సమాచారం. 2004లో జరిగిన మండల ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కిశోర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయనకు ఎంపీపీ పదవి దక్కింది. కాగా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా వర్గాన్ని కాపాడుకునేందుకే తాను బీజేపీలో చేరబోతున్నట్టు కిశోర్ రెడ్డి ప్రకటించారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న కిశోర్ రెడ్డి.. తప్పిదాల కారణంగానే ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందన్నారు. 
Allagadda
Bhuma akhilapriya
bhuma kishore reddy
Telugudesam
BJP

More Telugu News