Allu Arjun: బన్నీ .. త్రివిక్రమ్ సినిమాకి టైటిల్ ఖరారు?

  • షూటింగు దశలో బన్నీ మూవీ
  • త్రివిక్రమ్ తో మూడో సినిమా
  • భారీ తారాగణానికి చోటు      

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించిన కథా వస్తువుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకి 'నాన్న.. నేను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కొన్ని రోజుల క్రితం చెప్పుకున్నారు. ఈ టైటిల్ నే ఖరారు చేశారనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే, మరో కథానాయికగా నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో 'టబు' నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్ర కోసం 'ఖడ్గం' సంగీతను తీసుకున్నారని చెబుతున్నారు. గతంలో త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' హిట్ కావడంతో, తాజా చిత్రంతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News