Nani: ఆకట్టుకుంటోన్న 'గ్యాంగ్ లీడర్' టీజర్

  • వినోదభరితమైన కథాంశంతో 'గ్యాంగ్ లీడర్'
  • ప్రతినాయక పాత్రలో హీరో కార్తికేయ
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు    
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందుతోంది. నాని సరసన నాయికగా ప్రియాంకా మోహన్ పరిచయమవుతోంది. హీరో కార్తికేయ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

"ఈ రోజున ఇంటికి అయిదుగురు లేడీస్ వచ్చారు. వాళ్ల ఏజ్ లు .. గెటప్ లు చూస్తుంటే పుట్టుక నుంచి చావు దాకా ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టుగా అనిపించింది .. భలే వున్నారులే" అనే నాని డైలాగ్ తోనే కొంత కథ చెప్పడానికి విక్రమ్ కుమార్ ప్రయత్నించాడు. ఫార్ములా 2 రేస్ లు ఆడే వ్యక్తిగా కార్తికేయ పాత్రను పరిచయం చేశారు. ప్రతీకారం నేపథ్యంలో సాగే వినోదభరోతమైన కథగా ఈ సినిమా వుంటుందనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Nani
karthikeya
lakshmi
Priyanka

More Telugu News