పశ్చిమగోదావరిలో పొలంలోకి దూసుకెళ్లి పల్టీకొట్టిన ప్రైవేటు స్కూలు బస్సు!

  • పశ్చిమగోదావరిలోని తణుకులో ఘటన
  • ప్రమాద సమయంలో బస్సులో 34 మంది విద్యార్థులు
  • విద్యార్థులను కాపాడిన రైతులు
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు పెనుప్రమాదం తప్పింది. జిల్లాలోని తణుకులో 34 మంది విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో విద్యార్థులు హాహాకారాలు చేయగా, అక్కడే పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, బస్సులోంచి విద్యార్థులను బయటకు తీశారు.

కాగా, ఈ ఘటనలో చిన్నారులకు స్వల్ప గాయాలు అయ్యాయని, వారికి ప్రథమ చికిత్స అందించి ఇళ్లకు పంపించివేసినట్లు స్థానిక డాక్టర్లు తెలిపారు. మరోవైపు ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు స్కూలు బస్సుతో పాటు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? డ్రైవింగ్ సమయంలో ఆయన మద్యం సేవించి వున్నాడా? అనేవి ఇంకా తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Andhra Pradesh
West Godavari District
Road Accident
private school bus
tanuku

More Telugu News