Mahabubabad District: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రియురాలు.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు!

  • హైదరాబాద్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న యువతి
  • ఆమె మృతితో కుంగిపోయిన ప్రియుడు
  • మహబూబ్‌నగర్‌లో ఘటన
ప్రాణప్రదంగా ప్రేమించిన యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తట్టుకోలేకపోయిన ఆమె ప్రియుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిందీ ఘటన. తిమ్మసానిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు (22) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు. అయితే, హైదరాబాద్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న యువతి ఈ నెల 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

ఆమె దూరమైనప్పటి నుంచి ముభావంగా ఉంటున్న నాగరాజును చూసిన కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడతాడోనని వెన్నంటే ఉన్నారు. అయితే, చివరికి వారు భయపడినంతా అయింది. సోమవారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లిన నాగరాజు రాత్రి పొద్దుపోయినా తిరిగి రాలేదు. రైలు పట్టాలపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియడంతో వెళ్లి చూసిన వారికి గుండెలు అదిరిపోయాయి. మృతదేహాన్ని నాగరాజుదిగా గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
Mahabubabad District
Lover
suicide

More Telugu News