కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామాను సమర్పించనున్న కుమారస్వామి

23-07-2019 Tue 20:14
  • 105 - 99 ఓట్ల తేడాతో కుప్పకూలిన ప్రభుత్వం
  • బలాన్ని నిరూపించుకోలేకపోయిన కూటమి
  • ప్రభుత్వ సదుపాయాలన్నీ వదులుకున్న కుమారస్వామి
సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను మరిపించిన కర్ణాటక రాజకీయానికి నేటితో తెరపడింది. కర్ణాటకలో 105 - 99 ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. నేడు జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. దీంతో కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాలినడకన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వాజూభాయ్ వాలాకు రాజీనామాను అందించనున్నారు. ఓటమి అనంతరం ప్రభుత్వ సదుపాయాలన్నీ ఆయన వదులుకుని కాలినడకన వెళ్లేందుకు సిద్ధపడ్డారు.