ఇది కర్ణాటక ప్రజల విజయం: బీజేపీ

23-07-2019 Tue 20:12
  • అపవిత్ర కూటమికి, అవినీతి సర్కార్ కు ముగింపు ఇది
  • సుస్థిర ప్రభుత్వాన్ని, సమర్ధమైన పాలనను అందిస్తాం
  • కర్ణాటకను మళ్లీ అభివృద్ధి బాటపట్టిద్దాం
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈరోజు నిర్వహించిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం ఓటమిపాలైంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ ఓ ట్వీట్ చేసింది. ఇది కర్ణాటక ప్రజల విజయమని, అపవిత్ర కూటమికి, అవినీతి ప్రభుత్వానికి ముగింపు ఇదని పేర్కొంది. కర్ణాటక ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని, సమర్ధమైన పాలనను అందిస్తామని హామీ ఇస్తున్నామని, అందరం కలిసికట్టుగా కృషి చేసి కర్ణాటకను మళ్లీ అభివృద్ధి బాటపట్టిద్దామని పేర్కొన్నారు.