Kumaraswamy: అసెంబ్లీకి వచ్చినా తన చాంబర్ నుంచి బయటికి రాని సీఎం కుమారస్వామి

  • ఈ సాయంత్రం 4 గంటల తర్వాత కర్ణాటక అసెంబ్లీలో ఓటింగ్
  • విశ్వాసతీర్మానంపై కొనసాగుతున్న చర్చ
  • ముఖ్యమంత్రికి మాట్లాడే అవకాశం ఇస్తానన్న స్పీకర్
కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. అధికార, విపక్ష సభ్యులు సభలో మాట్లాడుతున్నారు. అయితే, అసెంబ్లీకి వచ్చిన సీఎం కుమారస్వామి మాత్రం సభలో అడుగుపెట్టకుండా తన చాంబర్ కే పరిమితమయ్యారు. అంతకుముందు ఆయన తన తండ్రి దేవెగౌడతో సమావేశమై చర్చలు జరిపారు. ఇటు, సభలో ఈ సాయంత్రం విశ్వాసపరీక్ష నిర్వహించనున్నారు. అందుకు వీలుగా, సాయంత్రం నాలుగు గంటలకు చర్చ ముగించాలంటూ స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎంకు మాట్లాడే అవకాశం ఇస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత బలపరీక్ష ఉంటుందని స్పీకర్ తెలిపారు.  
Kumaraswamy
Karnataka

More Telugu News