Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' కోసం రంగంలోకి 'ఖడ్గం' సంగీత

  • తెలుగులో సంగీతకి మంచి పేరు
  •  ఈ మధ్యనే తమిళంలోకి రీ ఎంట్రీ
  • తెలుగు రీ ఎంట్రీకి ఆమెను ఒప్పించిన అనిల్ రావిపూడి 
తెలుగు తెరపై అటు గ్లామర్ పరంగాను .. ఇటు నటన పరంగాను మంచి పేరు తెచ్చుకున్న నిన్నటితరం కథానాయికల్లో 'సంగీత' ఒకరు. ఆమె చేసిన చిత్రాల్లో 'ఖడ్గం' మంచిపేరు తెచ్చిపెట్టింది. అందువలన ఆమెను 'ఖడ్గం' సంగీతగా పిలుస్తుంటారు. వివాహమైన తరువాత కొంతకాలం పాటు నటనకి దూరమైన ఆమె, ఈ మధ్యనే తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

తాజాగా తెలుగులోను ఆమె ఒక సినిమా చేయడానికి అంగీకరించింది .. ఆ సినిమాయే 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అనిల్ రావిపూడి ఆమెను ఒప్పించినట్టుగా సమాచారం. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. మహేశ్ బాబు - రష్మిక మందన కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించనున్న సంగతి తెలిసిందే. 
Mahesh Babu
Rashmika
Sangeetha
Vijayashanthi

More Telugu News