Hyderabad: లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో బ్యాగేజ్ స్కానర్లు, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు!

  • హైదరాబాద్ లో జగన్ నివాసం
  • భద్రతను మరింత పెంచిన అధికారులు
  • ఏర్పాట్ల కోసం రూ. 24.50 లక్షలు విడుదల
హైదరాబాద్, బంజారాహిల్స్, లోటస్ పాండ్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఏపీ సర్కారు రూ. 24.50 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులతో బ్యాగేజ్ స్కానర్లు, అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను లోటస్ పాండ్ లో ఏర్పాటు చేయనున్నారు. జగన్ సీఎంగా ఎన్నికైన తరువాత, హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భద్రతా ఏర్పాట్లు సరిపోవని భావించిన ఉన్నతాధికారులు, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి బ్యాగులనూ తనిఖీ చేయాల్సిందేనని సూచించారు. దీంతో బ్యాగేజ్ తనిఖీ స్కానర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమయ్యే నిధులను రహదారులు, భవనాల శాఖ నుంచి ఖర్చు చేసేందుకు అనుమతిస్తూ, ఉత్తర్వులు వెలువడ్డాయి.
Hyderabad
Jagan
Lotuspond
Baggage Scanners

More Telugu News