koganti satyma: కోగంటి సత్యంను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

  • కోగంటి సత్యంకు ముగిసిన పోలీస్ కస్టడీ
  • ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడి
  • 30 సార్లు రెక్కీ నిర్వహించారట
ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంకు పోలీస్ కస్టడీ ముగిసింది. కోగంటి సత్యంను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కాగా, సత్యంతో పాటు ఎనిమిది మందిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. రాంప్రసాద్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర 30 సార్లు రెక్కీ నిర్వహించినట్టు విచారణలో తేలింది. డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లేందుకు రాంప్రసాద్ సిద్ధపడడంతో హత్యకు ప్లాన్ చేశామని కోగంటి సత్యం చెప్పినట్టు సమాచారం.  
koganti satyma
Ram prasad
police
Hyderabad

More Telugu News