ISRO: అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభమవుతుంది: ఇస్రో చైర్మన్

  • విజయవంతంగా భూ స్థిర కక్ష్యలో ప్రవేశం 
  • ఇది ఓ దశ మాత్రమేనన్న ఇస్రో చైర్మన్ శివన్
  • రానున్న 45 రోజులు అత్యంత కీలకమని వెల్లడి

చంద్రయాన్-2 ప్రయోగంపై ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ చంద్రయాన్-2లో ప్రస్తుతానికి స్పేస్ క్రాఫ్ట్ ను భూ స్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టడం జరిగిందని చెప్పారు.  ఇది ఓ దశ మాత్రమేనని, అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభమవుతుందని అన్నారు. రానున్న 45 రోజులు చంద్రయాన్-2 ప్రయోగంలో అత్యంత కీలకమని, సెప్టెంబరు 7న ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపిన తర్వాతే చంద్రయాన్-2 ప్రయోగం పూర్తయినట్టు భావిస్తామని శివన్ వివరించారు.

More Telugu News