Chandrayaan-2: చంద్రయాన్-2 ప్రయోగంపై రాష్ట్రపతి కోవింద్ స్పందన

  • శాస్త్రవేత్తలు, నిపుణులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రథమ పౌరుడు
  • ప్రతి భారతీయుడికి గర్వకారణం అంటూ ట్వీట్
  • మరిన్ని నూతన ఆవిష్కరణల దిశగా సాగిపోవాలంటూ ఆకాంక్ష

చారిత్రాత్మక చంద్రయాన్-2 ప్రయోగంపై దేశ ప్రథమపౌరుడు, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2 నింగికెగసిన క్షణాలు ప్రతిభారతీయుడికి గర్వకారణం అని పేర్కొన్నారు. దేశీయంగా ఇంతటి బృహత్తర  కార్యక్రమానికి రూపకల్పన చేసిన భారత శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు శుభాభినందనలు అంటూ కోవింద్ ట్వీట్ చేశారు.

ఇస్రో సరికొత్త సాంకేతికత దిశగా ప్రస్థానం సాగించాలని, సరికొత్త ఆవిష్కరణల దిశగా మరిన్ని ముందడుగులు వేయాలని ఆకాంక్షించారు. మరో 50 రోజుల్లో చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుందని, చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపనున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ చంద్రయాన్-2 మాత్రమేనని తెలిపారు. భారత విజ్ఞాన భాండాగారాన్ని మరింత సుసంపన్నం చేస్తుందనడంలో సందేహంలేదని స్పష్టం చేశారు.

More Telugu News