santhosh Varma: చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను: నటుడు సంతోష్ వర్మ

  • నటుడిగా బుల్లితెరపై మంచి గుర్తింపు
  •  వెండితెరపై కొనసాగే ప్రయత్నాలు
  •  సాధించవలసిందేదో వుందన్న సంతోష్ వర్మ    
నటుడిగా బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న సంతోష్ వర్మ, వెండితెరపై కూడా తన సత్తా చాటుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "కొంతకాలం క్రితం నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 140 .. 150 స్పీడ్ తో కార్లో వెళుతూ ఒక ట్యాంకర్ ను వెనక నుంచి కొట్టేశాను.

దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లవలసి వచ్చింది. ముందురోజు షూటింగు కారణంగా నిద్రలేదు. అయినా ఉదయానికల్లా పెళ్లికి అందుకోవచ్చనే ఉద్దేశంతో రాత్రివేళ బయల్దేరాను. తెల్లవారు జాము 3 గంటల సమయంలో డ్రైవింగ్ లో ఉండగానే కునుకు పట్టేసింది. అంతే కారు వెళ్లి ట్యాంకర్ ను కొట్టేసింది. అంత పెద్ద ప్రమాదం నుంచి బతికి బయట పడ్డానంటే, నేను సాధించవలసింది ఏదో వుంది అనే నాకు అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు. 
santhosh Varma

More Telugu News